ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరొకసారి తన సేవా స్పూర్తిని చాటుకుంది.
మానవసేవే మాధవసేవ అనే సంకల్పంతో మరొక అడుగు ముందుకేసి కరోనాతో మరిణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. కుప్పం మండలం ఎన్‌టీఆర్ కాలనీ కి చెందిన అప్పోజి(67) నిన్న రాత్రి కరోనాతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. వీరిది చాల పేద కుటుంబం మరియు వారు కూడా కరోనా బారిన పడడం వలన అంత్యక్రియలు చేసే పరిస్థితి వీలుకానందున, వారి వినతి మేరకు ఎన్‌టి్ఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు కుప్పం మున్సిపాలిటీ అధికారుల అనుమతి తీసుకోని ఈరోజు ఉదయం కుప్పం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.