ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరొకసారి తన సేవా స్పూర్తిని చాటుకుంది. మానవసేవే మాధవసేవ అనే సంకల్పంతో ఆహారం లభించని ప్రజలకు భోజన సదుపాయాలను సమకూర్చుతుంది.
ఇంతటి మంచి కార్యక్రామానికి మద్ధతుగా కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులైన వినోద్ కుమార్, వివేక్ పగడల, శరవణన్, బాలాజీ, లోకేష్, సురేష్, నాగరాజ్ గార్లు 300 కేజీల బియ్యాన్ని ట్రస్ట్‌కి అందించడం జరిగింది. ఈ సామాగ్రితో ప్రజలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని ప్రజలకు అందించాము. ఈ కార్యక్రమానికి సహకరించిన కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులకు అభినందనలు తెలియజేస్తున్నాము.