స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి ఆశయస్ఫూర్తితో…
శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి మార్గదర్శనంలో… శ్రీమతి నారా భువనేశ్వరిగారి సమర్ధ సారథ్యంలో 16 లక్షల మందికి పైగా ప్రజలకు సేవలందించి, నేటితో 24 సంవత్సరాలు పూర్తిచేసుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. అడుగడుగునా అంకితభావంతో ప్రజలకు విద్య, వైద్య, జీవనోపాధి రంగాలలో సేవలను అందిస్తూ… ప్రకృతి విపత్తులలో దేశవ్యాప్త ప్రజలకు అండగా నిలిచి ఆదుకుంటూ… ట్రస్ట్ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోన్న ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు.