ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు 4వ రోజు కుప్పం పర్యటనలో భాగంగా..









టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహిళల సమావేశంలో పాల్గొని, ”జ్యూట్ బ్యాగ్స్, బ్యాంగిల్స్” తయారీపై శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ”కుట్టు మిషన్” శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచితంగా ”కుట్టుమిషన్లు” పంపిణీ చేశారు. చిరు వ్యాపారులు ”తోపుడు బండ్లు’, దివ్యాంగులకు ”ట్రైసైకిళ్లును” ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి భువనేశ్వరి గారు మాట్లాడుతూ..,అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా కుప్పం నియోజకవర్గంలో తీర్చిదిద్దుతామని, మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కట్టుబడి ఉందని, మహిళలు తలచుకుంటే అద్భుతాలు సాధిస్తారని అన్నారు. త్వరలోనే మహిళలకు ”బ్యూటీషియన్, మగ్గం వర్క్” వంటి మరిన్ని రంగాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ (రిటైర్డ్) గారు,ఎన్టీఆర్ ట్రస్ట్ సీఓఓ అడుసుపల్లె గోపి గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మహిళలు,కుప్పం ప్రజలు పాల్గొన్నారు.