Service to Humankind is Service to God.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ మంగెనా & జిఎస్ఎల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఆరోగ్య శిబిరానికి 1200 మంది అన్ని వయసుల వారు వచ్చారు. ఈ ఆరోగ్య శిబిరాల్లో, వైద్య నిపుణుల పరివేక్షణలో 1 ,49 ,000 /- (ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు) విలువైన మందులను అవసరమయిన వారికీ అందించారు.

ఈ వైద్య శిబిరంలో క్రింది పరీక్షలు జరిగాయి:

బి.పి, షుగర్ పరీక్షలు, సాధారణ పరీక్షలు (ఎత్తు,బరువు మరియు BMI ), E .C .G

ఈ వైద్య శిబిరంలో పాలుగొన్న వైద్య చికిత్స విభాగాలు:

కార్డియాలజీ , ఊపిరితిత్తుల విభాగం, కంటి విభాగం, దంత విభాగం, ఎముకల విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు వైద్య విభాగము, కాన్సర్ విభాగం, చర్మ విభాగం, మానసిక వైద్య విభాగం, నాడి విభాగం, మూత్ర వ్యాధుల విభాగము, మరియు రక్త పరీక్షలు మొదలైనవి .

వైద్య శిబిరాలు నిర్వహించాలనుకుంటున్నారా?

దయచేసి సంప్రదించండి: 040 48577888 లేదా info@ntrtrust.orgకి ఇమెయిల్ పంపండి

#ఆరోగ్య సంరక్షణ #ఆరోగ్య శిబిరం #ఉచిత వైద్యశిబిరం

#ఉచితమెగావైద్యశిబిరం#ఎన్టీఆర్ ట్రస్ట్ఉచితమెగావైద్యశిబిరం

By Comments off October 19, 2023
loader