స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనుకునే మహిళల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉచిత కుట్టుమిషన్ శిక్షణను ప్రారంభించింది
ఒకరిపై ఆధారపడకుండా మహిళలు సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. నేర్చుకున్న శిక్షణతో సంపాదించి మహిళలు కుటుంబాన్ని పోషించుకోవచ్చని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె. రాజేంద్రకుమార్ ఐపిఎస్ (రిటైర్డ్) గారు అన్నారు .
నారా చంద్రబాబునాయుడు గారు స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించిన దగ్గర్నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ప్రకృతి విపత్తుల సమయంలో, విద్య, వైద్య రంగాలలో అనేక సేవలను అందిస్తోందని ఆయన తెలిపారు.