అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్కు చెందిన 2 యూనిట్ల రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో జిప్మర్, పుదుచ్చేరిలో మూత్రపిండ మార్పిడి (Renal Transplant) చేయించుకుంటున్న రోగికి సకాలంలో అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్, హైదరాబాద్ విజయవంతంగా సమన్వయం చేసింది.


అరుదైన రక్తగ్రూపులు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం ఎంతో కీలకం. సమయానికి సరైన రోగికి రక్తాన్ని చేరవేయడంలో మా బృందం చూపిన నిబద్ధత, సేవాభావం మరో ప్రాణానికి ఆశగా నిలిచింది.
ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన రక్తదాతలు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, రవాణా భాగస్వాములకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఒక రక్తదానం… ఎన్నో జీవితాలకు జీవనాధారం.
ప్రతి రక్తపు చుక్క విలువైనదే… ప్రతి దానం ప్రాణాలను కాపాడగలదు.
