12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అడుసుపల్లె గోపి గారు, వ్యాయామ ఉపాధ్యాయురాలు లక్ష్మీ శ్యామల గారు పాల్గొన్నారు. అలాగే ట్రస్ట్ సిబ్బందితో పాటు సుమారు 100 మందికి పైగా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.








ఈ సందర్భంగా యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని, ప్రతిరోజూ కనీసం గంటసేపు యోగా చేయాలని పిలుపునిచ్చారు.
