79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుక ఘనంగా జరిగాయి..ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్ర కుమార్ ఐపీఎస్ (రిటైర్డ్) గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.


ఈ వేడుకలో స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొన్న చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారితో శ్రీ రాజేంద్ర కుమార్ గారు ఆప్యాయంగా ముచ్చటించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఓఓ అడుసుపల్లె గోపి గారు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిబ్బంది, పౌరులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశభక్తిని సగర్వంగా చాటేలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.

