భగీరథ కెమికల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ వైద్య సేవల నిమిత్తం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు డొనేట్ చేసిన అంబులెన్స్ ను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీ Nara Bhuvaneswari గారు ప్రారంభించారు.
రక్తదానం గురించి అవగాహన పెంచడం మరియు అవసరమైన వారికి ప్రాణాలను రక్షించే రక్త సరఫరాలు సకాలంలో అందేలా చూడటం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్స్ యొక్క ముఖ్య లక్ష్యం.
శ్రీమతి నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ దాతల సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు.