ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన “స్వయం ఉపాధికి చేయూత” కార్యక్రమంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు.








ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి ద్వారా శిక్షణ తీసుకున్న 40 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 30 మందికి తోపుడు బండ్లు అందజేశారు. అలాగే పలువురికి వినికిడి మిషన్లు కూడా అందించారు. అదేవిధంగా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన కృత్రిమ చెయ్యిని ఒక లబ్ధిదారునికి అందజేశారు.
ఈ మహత్తర కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈవో కె. రాజేంద్ర కుమార్ ఐపీఎస్ (రిటైర్డ్) గారు, ట్రస్ట్ సీఓఓ అడుసుపల్లె గోపి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
